సాదినేని యామినిపై తిరుమలలో కేసు నమోదు

  • ఇటీవల టీటీడీపై విమర్శలు చేసిన యామిని
  • అయోధ్య భూమిపూజను ఎస్వీబీసీలో ప్రసారం చేయలేదంటూ వ్యాఖ్యలు
  • తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
టీడీపీలో ఉన్నన్నాళ్లు ఎంతో సందడి చేసిన సాదినేని యామిని బీజేపీలోకి వెళ్లాక చాలావరకు మౌనం దాల్చారు. ఇక తాజాగా ఆమెపై తిరుమలలో కేసు నమోదైంది. ఇటీవల అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరగ్గా, ఆ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ లో ప్రసారం చేయలేదంటూ విమర్శలు చేశారు. ఈ పరిణామం హిందువులను బాధిస్తోందని, హిందువులు ఇచ్చే కానుకలు, విరాళాలతో నడిచే టీటీడీ ఇలా చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ విజిలెన్స్ విభాగం సాదినేని యామినిపై తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆమెపై ఐపీసీ 505 (2), 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Sadineni Yamini
Case
Tirumala
TTD
Ayodhya Ram Mandir
BJP

More Telugu News